ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోవడంతో 90 మందికి పైగా జల సమాధి అయ్యారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో 130 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు.