ఏపీకి ఏమేం ఇచ్చారు

అన్ని ఆశలు.. ఆమెపైనే... ఆమె తీసుకొచ్చే రెడ్ పౌచ్‌లో.. చదివే ట్యాబ్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెబుతారా అని..? విభజన జరిగి పదేళ్లయినా ఇంకా అభివృద్ధి బాట పట్టని రాష్ట్రాన్ని ఎలా పట్టాలెక్కిస్తారా అని.. అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం... టీడీపీ-జనసేన సపోర్ట్‌ కేంద్రంలో కీలకం కావడంతో.. గత ఐదేళ్లలో పెద్దగా వినిపించని గుడ్ న్యూస్‌లు ఈ సారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దానికి తోడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన మార్క్ చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.