బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కోస్తావైపు కదులుతున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతనికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాతావరణశాఖ తాజా వెల్లడించిన వివరాల ప్రకారం పాండిచ్చేరికి 200 కిలోమీటర్లు, చెన్నైకి 130 కిలో మీటర్లు, నెల్లూరుకు 220, బాపట్లకు 330, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సోమవారం రాత్రి నుంచి మంగళివారం ఉదయం లోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.