ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలుసుకోవడంతో పట్టరాని ఆనందంలో యువతి - Tv9

ప్రేమించిన వారి పట్ల కొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రత్యేక మార్గాలను ఎంచుకుంటారు. తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ప్రపోజ్‌ చేస్తుంటారు. అలా ప్రేమలో ఉన్న ఓ యువతి చాలా గ్యాప్‌ తర్వాత తన ప్రియుడిని కలుసుకుంటుండటంతో తన పట్టరాని ఆనందాన్ని, ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికి అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది.