ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణిలు ఇష్టవచ్చినట్టు ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు, విమాన సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది.