భయపెడుతున్న మరో సొరంగం - Tv9

ఉత్రరకాశీని టన్నెల్‌ టెన్షన్‌ వీడటం లేదు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది కూలీలను సహాయక సిబ్బంది దాదాపు 17 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను భయపెడుతోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంతో అక్కడి కాలువలు, పంట భూములు దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.