పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడిన తుఫాను ఏపీపై అధిక ప్రభావం చూపనుంది. మంగళవారం ఉదయానికల్లా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న నేపధ్యంలో ఏపీవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాఅతలాకుతలమవుతోంది. తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలయమమయ్యాయి. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో శరవేగంగా జాగ్రత్తలు చేపట్టిన అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థలు పలు విమానాలను రద్దు చేశాయి.