పెళ్లి అనేది జీవితంలో మరపురాని వేడుక. అందుకని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు నేటి యువతరం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను స్థోమతకు తగ్గటు ఘనంగా జరిపించాలని భావిస్తున్నారు. కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. తాజాగా ఓ తండ్రి తన కూతురి వివాహాన్ని ఎవరూ ఊహించని విధంగా గాల్లో జరిపించి ఎప్పటికీ గుర్తుండేలా వార్తల్లో నిలిచారు.