వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. కానీ వాళ్లు ఏమీ వయసులో లేరు. వృద్ధాశ్రమంలో ఉన్న ఆ వృద్ధుల మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటి కంటే.. ఇప్పుడే ఒకరికి మరొకరి తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. అందుకే తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని వృద్ధాశ్రమం నిర్వాహకులకు చెప్పారు. అంతే ఇంకేముంది వృద్ధాశ్రమంలోనే దండలు మార్చి పెళ్లిని జరిపించారు నిర్వాహకులు.