నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. నిశ్చితార్థం జరిగినట్లు చెప్పారు. సిద్ధార్థ్.. ఇద్దరూ కలిసి ఉంగరాలు తొడిగిన ఫొటోని షేర్ చేస్తూ .. ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్‌అని పేర్కొన్నారు. అదే ఫొటోని ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. అతడు ఎస్ చెప్పాడు అని తెలిపింది.