దుబాయ్‌లో ఓ హత్యకేసులో నిందితుడుగా 17 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న తెలగాణ యువకుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది. 17 ఏళ్లు తర్వాత అక్టోబరు 6న తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతుల కుమారుడు లక్ష్మణ్‌కు 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.