ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు .. సీనియర్ అధికారులను వెంట బెట్టుకుని ఆదివారం గాజాకు వచ్చారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో ఆయన సమావేశమయ్యారు. వారిలో స్ఫూర్తి నింపారు. లక్ష్యం నెరవేరేవరకూ పోరాటం సాగుతుందని తెలిపారు. కమాండర్లు, సైనికులు ఆయనకు పరిస్థితిని వివరించారు. తాము తమ వీరోచిత సైనికుల వల్ల గాజాలో ఉన్నామనీ తమ పౌరులను విడిపించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటామని అన్నారు.