బీరకాయను అందరూ ఇష్టపడరు. కానీ బీరకాయలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. బీరకాయను కొందరు కూర, చట్నీతోపాటు పలు రకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఇతర కూరగాయలతో పోలిస్తే.. బీరకాయ మృదువుగా, సులభంగా ఉడుకుతుంది. కాబట్టి, దీన్ని వండడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా.. ఇతర కూరలతో కలిపి కూడా దీనిని వండవచ్చు..తినవచ్చు. ఎన్నో పోషకాలున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో.. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. బీరకాయలో సి, ఎ, కె విటమిన్లతోపాటు ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.