నీటి ఏనుగు నిజానికి ఇది శాకాహారి. భారీ శరీరం కలిగి ఎక్కువగా నీటిలోనే జీవిస్తుంది. ఇది సహారా ఎడారి దిగువ భాగంలో దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నీటి ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. శాకాహారి జంతువే అయినా దీనికి దూకుడు ఎక్కువ. నీటి ఏనుగుకు తెక్కరేగిందంటే పులులు, సింహాలు సైతం భయంతో తోక ముడిచి పారిపోవాల్సిందే. అలాగే పర్యాటకుల పైన కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. తాజాగా నీటి ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నది మధ్యలో బోటు శికాారు చేస్తున్న పర్యాటకులను వెంబడించి వారికి చెమటలు పట్టించింది. నీటి ఏనుగు వెంటబడిన తీరును చూస్తే షాక్ అవ్వాల్సిందే.