దీపావళి మరుసటి రోజున 13వ తేదీన సైదాబాద్ సదర్ మేళా నిర్వహించనున్నట్లు యాదవ్ సంఘం చావుణి ,ఉప్పర్ గూడ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.. చావుణి ఉప్పర్ గూడా యాదవ్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. నిజాం కాలం నుండి ఏర్పాటు చేస్తున్న సదర్ మేళాకి వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తారని కమిటీ సభ్యులు నిరంజన్ యాదవ్, రాంపాల్ యాదవ్,రాహుల్ కిషోర్ యాదవ్ లు తెలిపారు.