ఈ ఏడాది సంక్రాంతి సిల్వర్ స్క్రీన్ మీద మోర్ హెక్టిక్‌గా కనిపిస్తోంది. ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పండగ పూట వచ్చేస్తున్నాయి. ఇంత కాంపిటీషన్‌లో ధనుష్ సినిమా కాస్త ఢీలా పడింది. థియేటర్లు దొరకడం కష్టమే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంది. తెలుగు సినిమాలతో పాటు మేము సైతం అంటూ సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అయిపోయింది.. డబ్బింగ్ మూవీస్ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ పాన్ ఇండియా రేంజ్‌లో జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయింది.