పంజాబ్‌లోని పాటియాలాలో ఓ కుటుంబం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఒక ఇంట్లోని వంట గదిలో ఆహారం వండుతుండగా ప్రెజర్ కుక్కర్ పేలింది. ఆ సమయంలో ఆ వంట గదిలో ఉన్న మహిళలు, కాస్త దూరంలో ఉన్న ఒక వ్యక్తి, ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రెజర్ కుక్కర్ పేలడంతో ఆ వంట గది, అక్కడి వస్తువులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.