ఆ ఒక్కటే ఉంటే... అక్కినేనిని మించే.. హీరో అయ్యేవారు.. Chandra Mohan - Tv9

తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా... ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్‌. అలాంటి చంద్రమోహన్... తన పర్ఫర్మెన్స్‌తో.. ఏకంగా అక్కినేని నాగేశ్వరరావునే భయపడేలా చేశారు. ఎత్తులో.. తనకంటే.. ఒక్క అడుగు ఎక్కువుంటే.. నన్నే మింగేసేవాడు బహిరంగంగా.. చెప్పేలా చేసుకున్నారు చంద్రమోహన్.