129 ఏళ్ల వయసులోనూ ..కుంభమేళాకు వచ్చిన బాబా!

ప్రయాగ్‌రాజ్ లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దేశవిదేశాలనుంచి భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆరు కోట్ల మందికిపైగా హాజరై త్రివేణి సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఎందరో యోగులు, అఘోరాలు, స్వాములు, సిద్ధులు త్రివేణి సంగమానికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత, యోగా సాధకుడు 129 సంవత్సరాల స్వామి శివానంద బాబా ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళాలో పాల్గొన్నారు.