చైనాతో సరిహద్దు వివాదాలున్న 14 దేశాల్లో భారత్, భూటాన్ మినహా మిగతావన్నీ బీజింగ్‌తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘకాలంగా భూటాన్‌తో డ్రాగన్ దేశం సాగిస్తున్న చర్చలు కీలక దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో భూటాన్ రాజు వాంగ్‌చుక్ ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావడం ప్రాధాన్యం సంతరించుకొంది.