అప్పుడే పుట్టిన బిడ్డను బోరుబావిలో పడేశారు - Tv9

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో అప్పుడే పుట్టిన పసి బిడ్డను కనికరం లేకుండా బోరుబావిలో పడేశారు. పసి పాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఏడు గంటలపాటు శ్రమించి నవజాత శిశువును కాపాడారు. అసలేం జరిగిందంటే.. లారిపాలి గ్రామంలో వినియోగంలో లేని బోర్‌వెల్‌లో అప్పుడే పుట్టిన పసి బాలికను ఎవరో పడేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పసి బిడ్డ ఏడుపు విన్న గ్రామస్తులు పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య బృందాలను రప్పించి బోరుబావిలోకి ఆక్సిజన్‌ సరఫరా చేశారు.