యూకేను మరో మహమ్మారి కలవరపెడుతోంది. యూకేలో వంద రోజుల దగ్గు (100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ దగ్గు కారణంగా దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతటా వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 716కు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా సంక్రమణం అని చెబుతున్నారు.