ఏపీ సర్కార్ గంజాయిని కట్టడి చేయడంతో.. మత్తుకోసం కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు నిషారాయుళ్లు. ఇదే క్రమంలో బాపట్లలో మత్తు కోసం పెయిన్ కిల్లర్ మందులను ఇంజెక్షన్ ద్వారా ఉపయోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. జమ్ములపాలెం ఓవర్ బ్రిడ్జి మీద మత్తు మందు కలిపిన ఇంజెక్షన్లు తీసుకుంటున్నారనే సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసుల .ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.