ఓకాలేజ్ ప్రిన్సిపాల్‌పై కాలేజ్ మొత్తం దండెత్తింది. అధ్యాపకులనుంచి, విద్యార్ధుల వరకూ అందరూ అతనిపై ఫిర్యాదులే. ఈ క్రమంలో మాకొద్దీ ప్రిన్సిపాల్ అంటూ విద్యార్ధినిలు క్లాసులు బహిష్కరించి నిరసనకు దిగారు. అధ్యాపకులంతా వారికి అండగా నిలిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ ప్రవర్తన సరిగా లేదంటూ విద్యార్థినిలు అధ్యాపకులు పోలీసులను ఆశ్రయించారు.