మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో ఏకంగా 71.96 లక్షలమంది భారతీయుల ఖాతాలపై వేటు వేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్టు పేర్కొంది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి వంటివాటిపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన మొత్తం ఖాతాల్లో 19 లక్షల ఖాతాలపై ఫిర్యాదు అందకున్నా నిబంధనలు అతిక్రమించినందుకు గాను బ్యాన్ చేసినట్టు తెలిపింది.