నిజాంపేటలో తండ్రి కూతురిపై వీధి కుక్కల దాడి

నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నెలల బాబు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన మరువకముందే నిజాంపేటలో మరొక ఘటన చోటు చేసుకుంది. నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు చిన్నపిల్లలపై కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కట్టిన జరిగిన రోజు తప్ప మళ్ళీ యధావిధిగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు నెలల బాబుని పడుకోబెట్టి తాళం చెవి ఇచ్చేందుకు పక్కింటికి వెళ్లింది ఓ తల్లి. ఇంటికొచ్చి చూసేసరికి కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి కనిపించాడు.