బుల్లితెర అభిమానులను అమితంగా అలరించిన బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ కు శుభం కార్డు పడింది. కామన్ మెన్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. గ్రాండ్ ఫినాలే కూడా అట్టహాసంగానే జరిగింది. అంతా బాగానే ఉంది కానీ బిగ్ బాస్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులతో పాటు గ్రాండ్ ఫినాలేకు వచ్చిన అమర్ దీప్, గీతూ రాయల్ కార్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్ సీజన్ రెండో విన్నర్ కౌశల్ స్పందించాడు. బిగ్ బాస్ షో కేవలం ఆట మాత్రమేనని, ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని అభిమానులకు సూచించాడు.