దీపావళి రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో జోరుగా ప్రచారం సాగిస్తోన్న రేవంత్ రెడ్డి.. పండుగ రోజున బ్రేక్ ఇచ్చి తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడిన ఆయన.. 'తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.