లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందించాడు. ఏకంగా 3 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ లగ్జరీ కారును బహుమతిగా అందించాడు. ఈ విషయాన్ని నయనతార తనఎక్స్ వేదికగా వెల్లడించింది. వెల్‌కమ్ హోం యు బ్యూటీ అంటూ కారుకి స్వాగతం పలికింది. అత్యంత మధురమైన గిఫ్ట్ అందించిన భర్త విఘ్నేశ్‌కు ధన్యవాదాలు. ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది. కారు లోగో ఫొటోలను షేర్ చేసింది. కాగా నవంబర్ 18న నయనతార 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఈ బహుమతిని అందించాడు.