శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్తో ఓ అభిమాని మృతి చెందాడు. పట్టణంలోని రంగ థియేటర్ ఎదుట ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని బాలరాజు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా కోసం అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లెక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకింది. దీంతో కరెంట్ షాక్కు గురై బాలరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు.