దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌ని చూసేసిన చంద్రమోహన్... సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించేవారు. అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని అనుకోలేదు ఆయన. తన హెల్త్ పర్మిట్ చేస్తేనే సినిమాలు చేసేవారు. అలా ఓ సారి అల్లు అర్జున్ సినిమా సెట్లో.. ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడ్డారు. తన వల్ల హీరోతో సహా అందరూ ఇబ్బంది పడ్డారని ఫీలయ్యారు. ఇక అంతే ఉన్నపళంగా షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు చంద్రమోహన్.