అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గుంతకల్ RDO కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో నాగభూషణం తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. RDO కార్యాలయం అనుకున్నారో లేక.. తన స్వంత ఇళ్లు అనుకున్నారో తెలియదు కానీ.. తాను విధులు నిర్వహించే ఛాంబర్‌లోనే కాపురం పెట్టేంత పనిచేశారు. ఛాంబర్‌లో మంచం ఏర్పాటు చేసుకొని బెడ్ రూమ్‌గా వాడుకుంటున్నారు ఏవో. ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే పడకేస్తున్నాడు.