గతంలో డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధూ..ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతోంది. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరువలో ఉంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ. 96 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు టిల్లు స్క్వేర్ సినిమాపై సినీ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.