గ్రేట్ ట్రైన్ రాబరీ’.. ఎందుకంత సంచలనం సృష్టించింది - Tv9

సరిగ్గా 60 ఏళ్ల క్రితం.. 1963లో 15 మంది దొంగల ముఠా లండన్‌లో ఒక రైలును హైజాక్ చేసి.. 30 నిమిషాల్లో రూ.500 కోట్లు దోచుకెళ్లింది. తాజాగా ఆ ముఠాలోని చివరి వ్యక్తి బాబీ వెల్చ్‌ మృతి చెందాడు. దాంతో ‘గ్రేట్‌ ట్రైన్‌ రాబరీ’ స్టోరీ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఉత్తర లండన్‌లోని బ్రిడెగో బ్రిడ్జ్‌ సమీపంలో పెద్ద మొత్తంలో క్యాష్‌తో వెళ్తోన్న గ్లాస్గో-లండన్‌ రాయల్‌ మెయిల్‌ ట్రైన్‌ హైజాక్‌ అయ్యింది. నగదు గురించి ముందస్తు సమాచారం ఉన్న 15 మంది ఒక ముఠాగా ఏర్పడి.. భారీ దోపిడీకి ప్లాన్‌ వేశారు. వారు ముందుగా రైలు సిగ్నల్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు.