వాటే అందం..! హీరోయిన్లను మించిన బ్యూటీతో హీరో అబ్బాస్ కూతురు - Tv9

ఒకప్పుడు అమ్మాయిల రాజకుమారుడు అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు హీరో అబ్బాస్. 1996లో వచ్చిన ప్రేమ దేశం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు ఈ లవర్ బాయ్. చివరిగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించారు అబ్బాస్. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన ఈయన తెలుగు, తమిళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నాడు.