అయోధ్య రాముడ్ని దర్శించాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్ !! 1000కిపైగా రైళ్లు ప్రకటించిన భారత రైల్వే

2024 జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.