127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ
దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా, 127 ఏళ్ల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ విడిపోయింది. గోద్రేజ్ కుటుంబ వారసులు గ్రూప్ ను రెండుగా విభజించారు. ఈమేరకు వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, వాటాల పంపకం కూడా పూర్తయిందని సమాచారం.