Mohan Babu Emotional Video On Chandra Mohan Demise - Tv9

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. చంద్రమోహన్ మరణం పై ఎమోషనల్ అయ్యారు. తను కాలేజీ రోజుల్లో.. రంగుల రాట్నం సినిమాలో చంద్రమోహన్ నటన చూసి.. ముగ్దుడినయ్యానన్న మోహన్ బాబు.. ఆ తరువాత ఆయన సినిమాకే అసోసియేట్ డైరెక్టర్‌గా తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా అన్నారు. అప్పటి నుంచి చంద్రమోమన్‌తో.. తనకు మంచి అనుబంధం ఉందంటూ.. ఓ వీడియో మెసేజ్ పంపారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్‌ లో ఉండడంతో.. తన మిత్రుణ్ని చూసేందుకు రావడం లేదని చెప్పారు. వీడియో ద్వారానే ... చంద్రమోహన్ కుంటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మోహన్ బాబు.