ఓ మై గాడ్! సల్మాన్ ఫామ్ హౌస్ లోకి దూరిన దుండగులు Salman Khan - Tv9

ముంబై శివార్ల లోని పన్వేల్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఫాంహౌస్‌ లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్లిద్దరిని అదుపు లోకి తీసుకున్నారు. ఇద్దరి దగ్గరి నుంచి ఫేక్‌ ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో కూడా ఫాంహౌస్‌లో సల్మాన్‌ఖాన్‌పై దాడికి కుట్ర జరిగింది. చాలా రోజుల నుంచి సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తానని హెచ్చరించాడు లారెన్స్‌ బిష్ణోయ్‌ .