చిలుకూరులో భారీగా ట్రాఫిక్ జామ్ .. కి.మీల మేర క్యూలైన్ లో భక్తులు - Tv9

వీసా దేవుడు.. కలియుగదైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సంతానం లేని మహిళలకు గర్భ ప్రసాదం అందించారు. గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించి సంతానం కలగని మహిళలకు పంపిణీ చేయడంతో శుక్రవారం తెల్లవారుఝామున 5 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా చేరుకున్నారు.