వైసీపీలోకి స్టార్ డైరెక్టర్... - Tv9

నిన్న మొన్నటి వరకు డైరెక్టర్‌ అవతార్‌లో.. మనందరికీ కనిపించిన వివి వినాయక్.. తాజాగా మరో అవతార్‌లోకి ట్రాన్స్‌ ఫాం అవబోతున్నారు. సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి అరగేట్రం చేయబోతున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాదు.. ఎంపీ అభ్యర్థుల పరిశీలనలోనూ ఉన్నారట ఈ డైరెక్టర్. ఎస్ ! ఇటీవల హిందీలో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌తో ఛత్రపతి రిమేక్ చేసిన వినాయక్.. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో.. సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి మీడియాకు కూడా కనిపించలేదు. ఇక ఈ క్రమంలోనే... ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే న్యూస్‌తో.. సోషల్ మీడియాలో బిగ్ బ్రేకింగ్ గా మారారు.