హైదరాబాద్‌లో కేంద్ర సాయుధ బలగాలలో ఫ్లాగ్ మార్చ్

హైదరాబాద్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాల సిబ్బందితో కలిసి ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల్లో భద్రత, విశ్వాసాన్ని పెంపొందించేందుకే ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు.