ఓవైపు రైలు వస్తుండగా పట్టాలు దాటే ప్రయత్నం చేసింది ఓ మహిళ. రైలు వచ్చేస్తోందనే కంగారులో పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. దీంతో ట్రైన్ ఆమె పై నుంచి పోయినా ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఇదంతా రైల్వే స్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.