31 ఏళ్ల 165 రోజులు జీవించిన శునకం - Tv9

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బోబీ చనిపోయింది. 31 సంవత్సరాల 165 రోజుల వయసులో అది మరణించింది. 11 మే 1992లో జన్మించిన బోబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక కాలం జీవించిన శునకంగా గుర్తింపు పొందింది. రఫీరో డో అలెంటెజో‌ బ్రీడ్‌కు చెందిన ఈ శునకం అక్టోబరు 21న పోర్చుగల్‌లోని తాను నివాసముంటున్న ఇంట్లోనే చనిపోయింది.